Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani Chandrasekhar Warns Ambati Rambabu
  • వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక
  • ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య
  • సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి
  • 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ
  • అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, "బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు. 
Pemmasani Chandrasekhar
Ambati Rambabu
Andhra Pradesh Politics
TDP
YSRCP
Chandrababu Naidu
Vangalapudi Anitha
Political Controversy
Andhra Pradesh Government
AP Home Minister

More Telugu News