Balmoori Venkat: జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ నివాసంలో బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు

Balmoori Venkat Key Comments at MLA Sanjay Residence in Jagtial
  • ఎంతటి పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలన్న బల్మూరి వెంకట్
  • పార్టీ నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించకూడదని వ్యాఖ్య
  • సీనియర్ కదా అని కొంతకాలం ఓపిక పడతామన్న వెంకట్
  • ఎక్కువ కాలం ఇలాగే పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంతటి పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించారు.

ఎంత సీనియర్ నాయకుడైనా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు. సీనియర్ అయినా, జూనియర్ అయినా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానిని వ్యతిరేకించకూడదని అన్నారు. పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నాయకుడు కదా అని కాస్త ఓపికతో ఉంటామని, కానీ ఎక్కువ కాలం ఇలాగే వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేకూరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు తాను ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడటం లేదని, పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఇది తన బాధ్యత అన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తే నష్టపోయేది మనమేనని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులను కాంగ్రెస్ గెలుచుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Balmoori Venkat
Jagtial
MLA Sanjay
Congress Party
Telangana Congress
Jeevan Reddy
BRS

More Telugu News