Kapil Sibal: రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తున్నా మోదీ మాట్లాడటం లేదు: కపిల్ సిబాల్
- మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ తో 63గా ఉన్న రూపాయి 92కు పడిపోయిందన్న సిబాల్
- పేదలకు బడ్జెట్ ఉపయోగపడుతుందని ప్రతి సంవత్సరం అనుకుంటున్నామన్న సిబాల్
- ఈ బడ్జెట్ అయినా పేదల బాధను తగ్గించేలా ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నేత
మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి రేటు డాలర్‌కు 63గా ఉండగా, ప్రస్తుతం 92కు క్షీణించిందని మండిపడ్డారు. అయినప్పటికీ ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి సంవత్సరం అనుకుంటున్నానని, కానీ గత 11 ఏళ్లుగా ఆ విధంగా జరగడం లేదని అన్నారు. ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా పేదల బాధను తగ్గించి, ఆనందాన్ని పంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అన్నారు. అందుకు అనుగుణంగానే పేదల అభివృద్ధి, తక్కువ నిధులు ఉన్న రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించాలని అన్నారు.