Suryakumar Yadav: ఐదో టీ20: టాస్ గెలిచిన టీమిండియా... జట్టులో మూడు మార్పులు

Suryakumar Yadav Wins Toss India Opts to Bat in 5th T20
  • న్యూజిలాండ్‌తో చివరి టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • తిరిగి జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి 
  • స్థానిక హీరో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ
  • న్యూజిలాండ్ జట్టులో కూడా నాలుగు మార్పులు
  • అంపైర్ నితిన్ మీనన్‌కు ఇది 150వ అంతర్జాతీయ మ్యాచ్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ పోరుకు వేదికైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి తుది జట్టులోకి వచ్చారు.

స్థానిక ఆటగాడు సంజూ శాంసన్‌ను జట్టులో కొనసాగిస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించడంతో స్టేడియంలోని అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. టాస్ గెలిచిన అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, "రాత్రి సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అందుకే, స్కోరును కాపాడుకోవడంలో మా బౌలర్ల సత్తాను పరీక్షించాలనుకుంటున్నాం. తిరువనంతపురం అభిమానులకు శుభవార్త.. సంజూ శాంసన్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు" అని స్పష్టం చేశారు.

మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తమ జట్టులో కూడా నాలుగు మార్పులు చేసినట్లు తెలిపారు. ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, లాకీ ఫెర్గూసన్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా అంపైర్ నితిన్ మీనన్ 150 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా ఇప్పటికే చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ లో టీమిండియా 4-1తో ఆధిక్యంలో ఉంది.

రెండు జట్ల వివరాలు:

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.
Suryakumar Yadav
India vs New Zealand
T20 Series
Sanju Samson
Ishan Kishan
Axar Patel
Varun Chakravarthi
Cricket
Thiruvananthapuram
Mitchell Santner

More Telugu News