Ambati Rambabu: అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి: పార్థసారథి, వర్ల రామయ్య

Ambati Rambabus comments shameful says Parthasarathi
  • చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలు చేశారన్న టీడీపీ నేతలు
  • అంబటి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్య
  • అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్ చెప్పాలని డిమాండ్
వైసీపీ నేత అంబటి రాంబాబుపై ఏపీ మంత్రి పార్థసారథి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అంబటి రాంబాబు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. 

అంబటి రాంబాబు చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇలాంటి వ్యక్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చంద్రబాబు ఔన్నత్యాన్ని తాకలేవని చెప్పారు. అంబటి వాడిన పదజాలాన్ని ఆయన భార్యాబిడ్డలు కూడా ఛీకొడతారని అన్నారు. జగన్ భార్య భారతి గురించి మాట్లాడిన టీడీపీ నేతను అరెస్ట్ చేయించి రిమాండ్ కు పంపామని... ఇప్పుడు అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అనేది రాజకీయ పార్టీనా? లేక రౌడీల పార్టీనా? అని ప్రశ్నించారు.
Ambati Rambabu
Parthasarathi
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Political Controversy
YS Jagan Mohan Reddy
TDP
Bharati Reddy
Apology

More Telugu News