Narayanan: గగన్యాన్ కోసం 8 వేలకు పైగా ప్రయోగాలు: ఇస్రో ఛైర్మన్
- వ్యోమగాముల భద్రత దృష్ట్యా మానవరహిత రాకెట్ల ప్రయోగం
- మొదటి ప్రయోగం మార్చిలో చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి
- రాకెట్లోని ప్రతి వ్యవస్థను పరిశీలిస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్
తొలి మానవరహిత అంతరిక్ష ప్రయాణ మిషన్ 'గగన్యాన్'కు సిద్ధమవుతున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన 8 వేలకు పైగా ప్రయోగాలు సఫలమయ్యాయని తెలిపారు. వ్యోమగాముల భద్రత దృష్ట్యా మూడు మానవ రహిత రాకెట్లను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్రయోగం మార్చిలో చేపట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
రాకెట్లోని ప్రతి వ్యవస్థను పరిశీలిస్తున్నామని, గగన్యాన్ మిషన్ విజయవంతం చేయడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. రెండో మానవరహిత రాకెట్ ప్రయోగం ఈ ఏడాది చివరలో ఉంటుందని తెలిపారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్యాన్ మిషన్ చేపట్టగా, ఈ ప్రాజెక్టు తుది దశకు చేరిందని అన్నారు.
మానవ సహిత స్పేస్ మిషన్లో భాగంగా మార్చిలో వ్యోమమిత్ర రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. కాగా, 2027లో చేపట్టనున్న గగన్యాన్ మిషన్ కోసం వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికైన విషయం తెలిసిందే.