Koushik Reddy: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కౌశిక్ రెడ్డి

Koushik Reddy Ready to Quit Politics if Allegations Proven
  • కరీంనగర్ సీపీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న కౌశిక్ రెడ్డి
  • ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్
  • లేదంటే ఐపీఎస్ అసోసియేషన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • క్షమాపణ చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ పెడతానని హెచ్చరిక
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కరీంనగర్ సీపీ మత మార్పిడులకు పాల్పడుతున్నారని తాను వ్యాఖ్యానించినట్లు ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలను నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. "మత మార్పిడి చేస్తున్నట్టు కరీంనగర్ సీపీని నేను అన్నట్లు నిరూపించాలి. ఆ మాట నేను అనలేదు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు" అని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో విఫలమైతే ఐపీఎస్ అసోసియేషన్ నాయకులు తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకవేళ వారు క్షమాపణ చెప్పని పక్షంలో, వారిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) ప్రవేశపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. 

వీణవంక మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరగడం తెలిసిందే. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా, పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Koushik Reddy
Padi Koushik Reddy
Telangana IPS Association
Huzurabad MLA
Karimnagar CP
Privilege Motion
Veernavanka Jatara
Telangana Politics
Police
Allegations

More Telugu News