Sharad Pawar: ఎన్సీపీ (అజిత్) లో ఏం జరుగుతోందో నాకు తెలియదు: శరద్ పవార్

Sharad Pawar Unaware of Sunetra Pawars Alleged Oath as Deputy CM
  • ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణం విషయంపై స్పందన
  • న్యూస్ పేపర్ చూశాకే తెలిసిందన్న శరద్ పవార్
  • ఎన్సీపీలో రెండు వర్గాలు ఒక్కటవ్వాలన్నదే అజిత్ చివరి కోరికని వెల్లడి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని, తనతో ఎవరూ చర్చించలేదని వివరించారు. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ల ద్వారా అజిత్ పవార్ కూటమి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు. ఆ పార్టీ తరఫున సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని సునేత్రా పవార్ నిర్ణయించుకున్నట్లు తమ కుటుంబానికి తెలియదని శరద్ పవార్ పేర్కొన్నారు.

అజిత్ చివరి కోరిక..
ఎన్సీపీ రెండు కూటములు ఒక్కటవ్వాలన్నదే అజిత్ పవార్ కోరిక అని శరద్ పవార్ తెలిపారు. ఈ విషయంపై నాలుగు నెలలుగా అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్ చర్చలు జరిపారని, రెండు వర్గాల విలీనానికి ఫిబ్రవరి 12వ తేదీని ఫిక్స్ చేశామని కూడా చెప్పారు. అయితే, ఈలోపు దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని చెప్పారు. దీంతో విలీన చర్చలకు బ్రేక్ పడిందని వివరించారు. అజిత్ పవార్ చివరి కోరిక నెరవేరాలని తమ కుటుంబం కోరుకుంటోందని శరద్ పవార్ తెలిపారు.
Sharad Pawar
Ajit Pawar
NCP
Sunetra Pawar
Maharashtra Politics
Political Alliance
Praful Patel
Sunil Tatkare
BJP
Merger Talks

More Telugu News