Govindaraju: లోకాయుక్త వలకు చిక్కిన పోలీస్ 'తిమింగలం'.. అరెస్ట్ చేస్తుంటే కేకలు, పెడబొబ్బలు.. వీడియో ఇదిగో!

Govindaraju Arrested in Bribery Case by Lokayukta Karnataka
  • నిందితుడు కేపీ అగ్రహార పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు
  • చీటింగ్ కేసులో సాయం చేసేందుకు రూ. 5 లక్షలు డిమాండ్
  • రూ. 4 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
  • అరెస్ట్ చేస్తుంటే తప్పించుకునేందుకు కేకలు 
  • ఖాకీ యూనిఫాంలో ఉండి ఇలా ప్రవర్తించడం అవమానకరమన్న మాజీ సీపీ భాస్కర్ రావు
బెంగళూరులోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు ఒక చీటింగ్ కేసులో మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తికి బెయిల్ వచ్చేలా సాయం చేస్తానని, కేసు నుంచి పేరు తొలగిస్తానని రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. లక్ష వసూలు చేసిన ఆయన.. మిగిలిన రూ.4 లక్షలను చామరాజ్‌పేటలోని సీఏఆర్ గ్రౌండ్స్ వద్ద తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు మెరుపు దాడి చేశారు.

లోకాయుక్త అధికారులు తనను పట్టుకోగానే గోవిందరాజు షాక్‌కు గురయ్యారు. తప్పించుకునే మార్గం లేక నడిరోడ్డుపైనే గట్టిగా అరుస్తూ, తనను వదిలేయాలంటూ అధికారులతో పెనుగులాడారు. యూనిఫాంలో ఉండి ఆయన చేసిన ఈ రభస అంతా అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. దాదాపు ఆరుగురు అధికారులు కలిసి ఆయనను అతికష్టం మీద నియంత్రించి కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఇన్‌స్పెక్టర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు స్పందిస్తూ.. "ఇది అత్యంత సిగ్గుచేటు. యూనిఫాంలో ఉండి ఇలాంటి పనులు చేయడం వల్ల రాష్ట్రంలోని లక్ష మంది పోలీసుల గౌరవం మంటగలుస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోవిందరాజును అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
Govindaraju
Karnataka Police
Lokayukta
Corruption
Bribery Case
Bengaluru Police
Chamarajpet
CAR Grounds
Police Inspector Arrest
Anti Corruption Bureau

More Telugu News