APPSC Group 1: ఏపీపీఎస్‌సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల

APPSC Group 1 Results Released After Legal Hurdles
  • గ్రూపు 1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలు విడుదల
  • ఎంపికైన అభ్యర్ధుల వివరాలు ప్రకటించిన ఏపీపీఎస్‌సీ
  • హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న సాయంత్రం ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టింది. క్రీడా కోటా పరిధిలోకి వచ్చే సహాయ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌, డీఎస్పీ పోస్టులపై కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 

గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 2025 మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్‌లో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. అనంతరం గతేడాది జూన్‌ 23 నుంచి జులై 15 వరకు జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తి చేశారు. 

ఈ ఎంపిక జాబితాలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ 17, డీఎస్పీ పోస్టులు 25 ఉన్నాయి. అలాగే డీఎస్పీ (జైళ్లు) ఒకటి, డివిజనల్‌/జిల్లా ఫైర్‌ సర్వీస్‌ అధికారి రెండు, ఆర్టీవోలు ఆరు పోస్టులు ఉన్నాయి. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఒకటి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు, డిప్యూటీ రిజిస్ట్రార్స్‌ ఆరు, పురపాలక కమిషనర్‌ (సెకండ్‌ గ్రేడ్‌) మూడు పోస్టులు ఎంపికయ్యాయి. సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒకటి, సహాయ ట్రెజరీ అధికారి/సహాయ అకౌంటింగ్‌ అధికారి మూడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి నాలుగు, సహాయ ఆడిట్‌ అధికారి రెండు, మండలాభివృద్ధి అధికారి నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు
APPSC Group 1
APPSC
Group 1 Results
Andhra Pradesh Public Service Commission
Deputy Collector
DSP posts
Assistant Commissioner of State Tax
APPSC Notifications
Government Jobs Andhra Pradesh
APPSC Exams

More Telugu News