Jeffrey Epstein: అమెరికా రాజకీయాల్లో ఎప్‌స్టీన్ ఫైల్స్ ముసలం!
- ట్రంప్‌ను ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుందన్న ఎఫ్‌బీ
- ట్రంప్ పాలనలో కుష్నర్ అతిగా జోక్యం చేసుకున్నారని ఆరోపణ
- కుష్నర్ కుటుంబానికి రష్యా మనీ లాండరింగ్‌తో సంబంధాలున్నట్లు రిపోర్ట్
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన తాజా పత్రాలు అమెరికా అధ్యక్ష కార్యాలయం 'వైట్ హౌస్' పునాదులను కదిలిస్తున్నాయి. ఎఫ్‌బీఐకి చెందిన ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఇజ్రాయెల్ శాసిస్తోందని, ఆయన పూర్తిగా ఆ దేశ ప్రభావంలో ఉన్నారని ఈ నివేదిక బాంబు పేల్చింది.
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌పై ఈ నివేదికలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా, అధ్యక్షుడి అధికారిక నిర్ణయాల్లో కూడా కుష్నర్ అనవసరంగా తలదూర్చారని ఎఫ్‌బీఐ పేర్కొంది. కుష్నర్ కుటుంబానికి రష్యా నుంచి అక్రమంగా వచ్చే నిధులతో సంబంధాలు ఉన్నాయని, అలాగే అతివాద జియోనిస్ట్ నెట్‌వర్క్ అయిన 'చబాద్'తో లింకులు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం రాజకీయ నాయకులే కాకుండా, ఎప్‌స్టీన్ తరఫున వాదించిన ప్రముఖ లాయర్ అలెన్ డెర్షోవిట్జ్ కూడా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ 'మొసాద్' ఏజెంట్‌గా వ్యవహరించారని నివేదిక పేర్కొంది. మేధావులను, విద్యార్థులను ప్రభావితం చేసేందుకు మొసాద్ ఆయన్ని వాడుకుందని ఎఫ్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి.
కుష్నర్ తండ్రి గతంలో ఆర్థిక నేరాల్లో శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా ఈ నివేదిక గుర్తు చేసింది. అప్పట్లో నేరం రుజువైనప్పటికీ, ట్రంప్ తన అధ్యక్షాధికారాలను ఉపయోగించి ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించడం వెనుక ఈ 'ప్రభావిత' శక్తుల హస్తం ఉందనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఈ నివేదికపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల వేళ ఈ ఫైల్స్ బయటకు రావడం ట్రంప్ వర్గానికి పెద్ద తలనొప్పిగా మారింది.