Revanth Reddy: వాహన రిజిస్ట్రేషన్‌కు బ్యాంక్ ఖాతా లింక్.. చలానాల కోసమేనా? అసలు నిజమిదే!

Vehicle Registration Linked to Bank Account Truth Revealed
  • వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ తప్పనిసరి
  • ట్రాఫిక్ జరిమానాలు నేరుగా అకౌంట్ నుంచి కట్ అవుతాయని ప్రచారం
  • అతివేగం, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలపై సీఎం గతంలోనే హింట్ 
  • ఇది కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసమేనని రవాణా శాఖ వెల్లడి
షోరూమ్‌ల వద్దే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన తెలంగాణ అధికారులు ఇప్పుడు ఒక కొత్త కండిషన్ పెట్టారు. అకౌంట్ నంబర్ ఇవ్వకపోతే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పత్రాలు అప్‌లోడ్ కావడం లేదు. దీంతో షోరూమ్ నిర్వాహకులు కూడా తప్పనిసరిగా బ్యాంక్ వివరాలు అడుగుతున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకునేలా 'ఆటో డెబిట్' విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ వివరాలు సేకరిస్తుండటంతో.. ఇకపై చలానాలు నేరుగా అకౌంట్ నుంచే కోత పడతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే, అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. కేవలం చిరునామా ధ్రువీకరణ కోసమే బ్యాంక్ వివరాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. వాహన యజమానులు ఇళ్లు మారినప్పుడు పాత అడ్రస్‌లే రికార్డుల్లో ఉంటున్నాయని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని గుర్తించడం కష్టమవుతోందని అధికారులు వాదిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉంటే వారి తాజా చిరునామాను సులభంగా కనుగొనవచ్చని రవాణా శాఖ వివరణ ఇస్తోంది. 
Revanth Reddy
Telangana vehicle registration
Bank account link
Traffic challans
Auto debit system
Vehicle owner address verification
Road accidents
Transport Department Telangana

More Telugu News