Pawan Kalyan: పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: కాటసాని రాంభూపాల్ రెడ్డి

Pawan Kalyan Should Apologize Says Katasani Rambhupal Reddy
  • తిరుమల లడ్డూ విషయంలో పవన్ తప్పుడు ప్రచారం చేశారన్న కాటసాని
  • లడ్డూలో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిందని వ్యాఖ్య
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని పవన్ మానుకోవాలని హితవు
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిన నేపథ్యంలో హిందూ సమాజానికి పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మెట్లను పవన్ పై నుంచి కిందకు కడుగుతారా? లేక కింద నుంచి పైకి కడుగుతారా? అని ప్రశ్నించారు. ఇకనుంచి అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. 

తమ అధినేత జగన్ చెప్పులు వదిలి తిరుమల ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించేవారని కాటసాని చెప్పారు. శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడ కూల్చివేశారని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడ కూల్చి వేయడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గోడను కూల్పించారని ఆరోపించారు. సొంత ఖర్చులతో ప్రహరీ గోడను తిరిగి నిర్మించాలని, బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
Pawan Kalyan
Katasani Rambhupal Reddy
Tirumala
Tirupati Laddu
YCP
Fake News
Apology
Srisailam
Karivena Brahmin Satram
Budda Rajasekhar Reddy

More Telugu News