Gold Prices: బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణం ఇదే!

Why Gold Silver Rates Decreased Today
  • ఈరోజు భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
  • రూ. 30 వేల వరకు తగ్గిన కిలో వెండి ధర
  • మార్కెట్ పై ఒత్తిడి పెంచుతున్న డాలర్ రేటు పెరుగుదల
కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఈరోజు పతనమయ్యాయి. ఆకాన్నంటిన ధరలు ఈ రోజు హఠాత్తుగా పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 వేల వరకు తగ్గగా... కిలో వెండి ధర దాదాపు రూ. 30 వేల వరకు పతనమయింది. 

ఈ భారీ తరుగుదలపై నిపుణులు సంచలన విషయాలను చెబుతున్నారు. డాలర్ మళ్లీ బలపడుతోందని... అందుకే ఈ మార్పు అని అన్నారు. రూపాయితో పోలిస్తే డాలర్ రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ పై ఒత్తిడి పెరిగిందని తెలిపారు. ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 

డాలర్ బలంగా ఉన్నప్పుడు లోహాలు చౌకగా అవుతాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండితో పాటు ఇతర మెటల్స్ ధరలు కూడా ఈరోజు తగ్గాయి. దీనికి తోడు కేంద్ర బడ్జెట్ ఉండటం కూడా మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మెటల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే.

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచడం కూడా డాలర్ ను బలోపేతం చేసింది. ధరల్లో ఊగిసలాట కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  
Gold Prices
Gold rate today
Silver Prices
Silver rate today
Dollar vs Rupee
Rupee value
Market trends
Investment
Commodity Market

More Telugu News