Nara Lokesh: పవన్ తో అనుబంధం, కాలేజీ రోజుల గురించి... విద్యార్థుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబులు
- కాకినాడ జేఎన్‌టీయూలో విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి
- పవన్ కల్యాణ్‌తో బంధం, తన చదువు, కాలేజీ అనుభవాలు వెల్లడి
- పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనపై విద్యార్థులకు స్పష్టమైన హామీ
- గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగం, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రణాళికల వెల్లడి
- స్టార్టప్‌లను ప్రోత్సహించి యువతను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని భరోసా
కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం, తన చదువు, ఇంటర్న్‌షిప్ అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. గోదావరి పుష్కరాలు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగం అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. వ్యక్తిగత జీవితం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు అనేక అంశాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. జేఎన్‌టీయూ ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.
విద్యార్థుల ప్రశ్నలు – మంత్రి లోకేశ్ సమాధానాలు
శ్రావ్య, సివిల్ ఇంజనీరింగ్ ఫైనలియర్
గోదావరికి ఏటా వచ్చే వరదల సహాయ చర్యల్లో విద్యార్థులుగా మేము ఏం చేయగలం? గోదావరిపై మీ ఆలోచనలు ఏమిటి?
నారా లోకేశ్: ఉభయగోదావరి జిల్లాలు రాష్ట్రానికి ధాన్యాగారాలని, ఆక్వాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. స్థిరమైన అభివృద్ధి అవసరమని, డిజిటల్ ట్విన్స్ వంటి టెక్నాలజీతో వరదలను ముందుగా పసిగట్టే ప్రయత్నం చేయాలి. ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో ఆక్వాకు కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. సమాజంలోని వాస్తవ సమస్యలను పరిష్కరించే దిశగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి పెట్టాలి.
యువరాజ్, బిటెక్, 2వ సంవత్సరం
మీరు ఇంజనీరింగ్‌లో రికార్డులు, అసైన్‌మెంట్లు మీరే రాశారా? మీ వైవా ఎలా జరిగింది?
నారా లోకేశ్: నేను యూఎస్‌లోని కార్నెగీ మెల్లన్ కళాశాలలో చదివాను, అక్కడ ఇతరులతో రాయించే విధానం లేదు (నవ్వుతూ). నేను బట్టీ పట్టే రకం కాదు, క్రిటికల్ ఎనలిటికల్ థింకింగ్‌పై దృష్టి పెట్టాను. విద్యామంత్రిగా కూడా అదే విధానంలో ఆలోచిస్తున్నా. వేరొకరి పేపర్ చూసి రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. కృత్రిమ మేధ (AI) మిమ్మల్ని మెరుగుపరుస్తుంది కానీ, దానిపై పూర్తిగా ఆధారపడొద్దు.
ఐశ్వర్య, 3వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్
యూపీలో కుంభమేళాకు మీరు వెళ్లారు కదా, అక్కడ ఎలా నిర్వహించారు? రాబోయే గోదావరి పుష్కరాలు ఎలా చేయబోతున్నారు?
నారా లోకేశ్: కోట్లాది మంది హాజరయ్యే కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. కుంభమేళాలో అక్కడి ప్రభుత్వం ఘాట్లను డిజిటల్ ట్విన్‌తో అనుసంధానించి అద్భుతంగా నిర్వహించింది. గతంలో రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటన పునరావృతం కాకుండా, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాం. క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని జేఎన్‌టీయూ యాజమాన్యాన్ని కోరుతున్నాం.
సాయిప్రకాష్, బి.టెక్ 3వ సంవత్సరం
నేను పిఠాపురం వాడిని. మీరు, పవన్ కల్యాణ్ గారు సొంత అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మీరిద్దరూ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు? మీ మధ్య బంధం ఎలాంటిది?
నారా లోకేశ్: 2014 ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ గారిని కలిశాను. చంద్రబాబు గారిని రిమాండ్‌లో పెట్టినప్పుడు, పవనన్న వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచిన విధానం జీవితాంతం గుర్తుంటుంది. కష్టకాలంలో మన వెంట ఎవరు నిలబడతారో వారే నిజమైన మిత్రులు. యువత అటువంటి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మా అనుబంధం అలాంటిది.
చాందిని, బిటెక్ విద్యార్థిని
మనం ఎంత ఎదిగినా కులం, మతం, ప్రాంతం అనే చట్రాల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నాం? దీనిపై మీ అభిప్రాయం?
నారా లోకేశ్: కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభజన తెస్తున్నారు. ఏ కుటుంబంలో పుట్టాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మనుషులుగా మనందరిపై సామాజిక బాధ్యత ఉంటుంది. మా కుటుంబంలో అందరం కలిసే ఉంటాం, మాకు వ్యక్తిగత ఖాతాలు లేవు, అన్నీ ఉమ్మడి ఆస్తులే. ఇదే మన భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పదనం. ఏ టెక్నాలజీ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను భర్తీ చేయలేదు.
దిలీప్ కుమార్, పెట్రోలియం ఇంజనీరింగ్, 3వ సంవత్సరం
ప్రాథమిక విద్యలో లీప్ ప్రోగ్రామ్ తెచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా తక్కువ ఖర్చుతో డిజైనింగ్, టెస్టింగ్ మోడల్ అమలు చేయగలరా?
నారా లోకేశ్: తప్పకుండా. ఉన్నత విద్యలో పరిశ్రమల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కరిక్యులమ్ రూపొందిస్తున్నాం. స్కిల్ గ్యాప్‌ను భర్తీ చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మీకు నేర్పిస్తాం. కాకినాడ ప్రాంతంలో పెట్రోలియం, ఆక్వా, గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. పరిశోధనల కోసం కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధుల్లో కొంత భాగాన్ని కేటాయించాలని కేంద్రమంత్రిని కూడా కోరాను.
కౌశిక్, బిటెక్ 3వ సంవత్సరం
ఎప్పుడైనా కాలేజీ బంక్ కొట్టారా? కొడితే ఎక్కడికి వెళ్లేవారు?
నారా లోకేశ్: నేను చదివిన అమెరికన్ విద్యావిధానంలో అటెండెన్స్‌కు కూడా మార్కులు ఉంటాయి. అందుకే నేను పెద్దగా బంక్ కొట్టలేదు. నాకు 90% అటెండెన్స్ ఉంటే, నా భార్య బ్రాహ్మణికి 100% ఉండేది. క్లాసులు అయ్యాక మిత్రులతో కెఫెటేరియాలో కూర్చుని జరిపే చర్చలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
కీర్తి, కెమికల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం
ఏపీ అభివృద్ధిలో కెమికల్ ఇంజనీరింగ్‌ను ఎలా ఉపయోగించుకుంటారు?
నారా లోకేశ్: రాష్ట్రంలో క్లస్టరైజేషన్ విధానం ద్వారా ఆయా ప్రాంతాలకు అనువైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. అనకాపల్లిలో ప్రత్యేకంగా కెమికల్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా పెద్ద ఎత్తున కెమికల్, ఫార్మా సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తాం. నాకు కెమికల్ ఇంజనీరింగ్‌పై పూర్తి అవగాహన లేకపోయినా, ఈ రంగం అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్‌ను కల్పించే బాధ్యత నాది.
అడ్డూరి ఆలయశ్రీ, బి.టెక్ విద్యార్థిని
ఇంజనీరింగ్ పూర్తవుతోంది, ఉద్యోగం ఎలా సంపాదించాలి? ‘నైపుణ్యం’ పోర్టల్ మాకు ఎలా ఉపయోగపడుతుంది?
నారా లోకేశ్: ‘నైపుణ్యం’ పోర్టల్ ద్వారా కాన్వర్సేషనల్ ఏఐని ఉపయోగించి మీ నైపుణ్యాలను అంచనా వేస్తున్నాం. ఇప్పటికే 75 వేల మందిని స్క్రీనింగ్ చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక 755 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. వాటి ద్వారా స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయి. సంక్షేమంతో పాటు ఉద్యోగ కల్పనే మా ప్రభుత్వ ప్రాధాన్యత. మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగం కల్పించే బాధ్యత మాది.
శ్రావ్య, బిటెక్ 3వ సంవత్సరం
మీరు, సీఎం గారు దావోస్ వెళ్లారు. అక్కడ కేవలం చర్చలేనా లేక పరిశ్రమల ఏర్పాటుకు హామీలు వచ్చాయా?
నారా లోకేశ్: దావోస్ అనేది ఒప్పందాలు చేసుకునే వేదిక కాదు, రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వేదిక. అక్కడ నిపుణులను కలిసి మన రాష్ట్రానికి ఆహ్వానించవచ్చు. గత ఏడాది దావోస్‌లో కలిసిన తర్వాతే కాగ్నిజెంట్ సంస్థ విశాఖలో తమ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, అందులో 80% స్థానికులకే ఇచ్చాం.
అహల్య, బి.టెక్ విద్యార్థిని
మీరు ఎప్పుడైనా ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యారా? మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన ఇంటర్వ్యూ ఏది?
నారా లోకేశ్: నేను మూడు ఇంటర్న్‌షిప్‌లు చేసి, వరల్డ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాను. 2002-03లో జర్మనీలో పనిచేసినప్పుడు భాష, అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అదే నేను ఎదుర్కొన్న సవాలు. మన వర్సిటీల్లో ఫైనల్ పరీక్షలకు ఇన్విజిలేటర్లు ఉండని హానర్ కోడ్ వంటి క్రమశిక్షణను తీసుకురావాలి. గ్లోబల్ టాలెంట్‌ను మన రాష్ట్రంలో తయారు చేయడమే నా లక్ష్యం.
అవినాష్, పెట్రోలియం ఇంజనీరింగ్
విద్యార్థులకు రవాణా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల పరిస్థితి బాగాలేదు. ఏం చేస్తారు?
నారా లోకేశ్: ఉచిత బస్సు పథకంతో పెరిగిన రద్దీని గమనించాం, త్వరలోనే బస్సుల సంఖ్య పెంచుతాం. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి, నాణ్యమైన సేవలు అందేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో 'వన్ క్లాస్-వన్ టీచర్' విధానం తెస్తున్నాం. ఇప్పటికే 16 వేల మందిని నియమించాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం, మీరంతా నమ్మకంతో ఉండండి.
విశాల్, కెమికల్ ఇంజనీరింగ్
ఇటీవల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీపై మీ పాలసీ ఏంటి?
నారా లోకేశ్: భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. అందుకే గ్రీన్ పవర్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాం. త్వరలో భారత్ గ్రీన్ ఎనర్జీలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. దేశంలోనే తొలి గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ ప్రాజెక్టును కాకినాడలో ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. ఈ రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి.
ప్రసన్న, ఫార్మసీ విద్యార్థిని
రాష్ట్రంలో ఫార్మసీ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
నారా లోకేశ్: ఫార్మా కంపెనీలను ఆకర్షించేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. విశాఖలో మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఏఎంటీజడ్) ఏర్పాటు చేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ వల్లే భారత్ బయోటెక్ వంటి సంస్థలు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగాయి. అలాంటి శక్తివంతమైన ఎకోసిస్టమ్‌ను మన ఏపీలో కూడా కల్పిస్తాం.
వాసుదేవ్, బి.టెక్ ఫైనలియర్, పెట్రోలియం ఇంజనీరింగ్
మాకు కోర్ సైడ్ జాబ్స్, ప్లేస్‌మెంట్స్ రావడం లేదు. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వండి.
నారా లోకేశ్: కెరీర్ గైడెన్స్, ప్లేస్‌మెంట్ల బాధ్యత వైస్ ఛాన్సలర్లదే. అందుకే రాజకీయ ప్రమేయం లేకుండా వారిని నియమించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేస్తాం, విద్యార్థులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 4 వేల ప్రొఫెసర్ పోస్టులను న్యాయపరమైన చిక్కులు తొలగించి త్వరలోనే భర్తీ చేస్తాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం.
తులసి, బి.టెక్ 2వ సంవత్సరం
ఇంగ్లీషు, తెలుగులాగే వ్యవసాయాన్ని కూడా ఒక సబ్జెక్టుగా ఎందుకు ప్రవేశపెట్టకూడదు?
నారా లోకేశ్: ఇది చాలా మంచి సూచన. చిన్న వయసులోనే వ్యవసాయం, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన అవసరం. అందుకే 'నో బ్యాగ్ డే' వంటి కార్యక్రమాలు చేపట్టాం. పంటకు గిట్టుబాటు ధర, సరఫరా-డిమాండ్ మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాం. పంటల మార్పిడి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించవచ్చు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే సీఎం గారి లక్ష్యం.
కోమలి స్వాతి, 3వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్
దేశం అభివృద్ధి చెందుతున్నా పేదరికం తగ్గడం లేదు, ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయి. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటి?
నారా లోకేశ్: నైతిక విలువలు లేని అభివృద్ధికి అర్థం లేదు. ధనిక, పేదల మధ్య అంతరాలను తగ్గించడమే నిజమైన అభివృద్ధి. అందుకే ముఖ్యమంత్రి గారు పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని తెచ్చారు. ఐటీ విప్లవంలాగే ఇప్పుడు ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. డేటా సెంటర్లు, క్వాంటమ్ టెక్నాలజీతో మన దేశానికి, రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంది.
ప్రెస్కిల్లా, బి.టెక్ విద్యార్థిని
పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలి అంటున్నారు. ఆటలు, పాటలు లేకుండా అది సాధ్యమేనా?
నారా లోకేశ్: సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం నా ఉద్దేశం కాదు. వయసు ఆధారిత కంటెంట్ యాక్సెస్ ఉండాలనేది మా ఆలోచన. సైబర్ బుల్లింగ్ వంటి ప్రమాదాల నుంచి పిల్లలను కాపాడటానికే ఈ చర్యలు. లైబ్రరీలు, స్పోర్ట్స్ స్టేడియంలను అభివృద్ధి చేసి వారికి ప్రత్యామ్నాయ వినోదాన్ని అందిస్తాం. ఫ్రాన్స్, బ్రిటన్, గోవాలో ఇప్పటికే ఇలాంటి నిబంధనలు ఉన్నాయి.
నాగేశ్వరి, తాడేపల్లిగూడెం, ఈసీఈ ఫైనలియర్
గోదావరి జిల్లాలకు ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి? మేం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి?
నారా లోకేశ్: అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. క్లస్టర్డ్ విధానంలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో గ్రీన్ మాలిక్యూల్స్, ఆక్వా రీసెర్చ్, పామాయిల్, కోకో వంటి రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమలను తీసుకొచ్చి, స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చూస్తాం.
కీర్తి, ఎంఏ సెకండియర్, మార్కెటింగ్
మేము ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు?
నారా లోకేశ్: యువత ఉద్యోగాలు అడిగేవారిగా కాకుండా, ఇచ్చేవారిగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఆర్టీఐహెచ్ ద్వారా బలమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. నేను 2019లో ఓడిపోయినా, ఐదేళ్లు కష్టపడి ఇప్పుడు గెలిచాను. ఓటమి అంటే 'ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్' అని గుర్తుంచుకోండి. వైఫల్యాలకు భయపడి ఆత్మహత్యల వంటి ఆలోచనలు చేయవద్దు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఆదిరెడ్డి శ్రీనివాస్, యనమల దివ్య, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జేఎన్టీయూ వీసీ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.