Shailendra Singh: సల్మాన్-ఐశ్వర్యలది 'వయలెంట్ లవ్ స్టోరీ'.. నిర్మాత శైలేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు

Shailendra Singh on Salman Aishwarya Violent Love Story
  • అర్ధరాత్రి ఐశ్వర్య ఇంటి వద్ద సల్మాన్ గొడవ చేశారని ప్రస్తావించిన నిర్మాత‌
  • ఒక సినిమా విషయంలో అవమానించడంతో సల్మాన్‌తో స్నేహం ముగిసిందని వెల్లడి
  • నల్ల కళ్లద్దాలతో ఐశ్వర్య అవార్డు షోకి రావడంపై స్పందించిన నిర్మాత
  • 18 ఏళ్ల వయసులోనే ఐశ్వర్యను గుర్తించి తొలి అవకాశం ఇచ్చానన్న‌ శైలేంద్ర
బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రేమ వ్యవహారం గురించి ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ‘ఫిరాఖ్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారి బంధాన్ని ఒక ‘వయలెంట్ లవ్ స్టోరీ’గా అభివర్ణించారు. వారిద్దరి మధ్య ఉన్నది తీవ్రమైన ప్రేమ అని, రోమియో జూలియట్ కథ లాంటిదని పేర్కొన్నారు.

గతంలో ఐశ్వర్య రాయ్ నివాసం వద్ద సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి గొడవ చేశారన్న ఆరోపణలను శైలేంద్ర సింగ్ పరోక్షంగా ప్రస్తావించారు. "ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉంటున్న బిల్డింగ్‌లోనే ఐశ్వర్య కూడా ఉండేవారు. ఆ సమయంలో సల్మాన్ అక్కడికి వెళ్లడం, జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఓ అవార్డు ఫంక్షన్‌కు ఐశ్వర్య నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వచ్చారు. సల్మాన్ చాలా ప్యాషనేట్ వ్యక్తి, ఐశ్వర్య ఎంతో గౌరవప్రదమైన, హుందాగా ఉండే మనిషి" అని శైలేంద్ర వివరించారు. అయితే, ఆ ఘటన గురించి ఐశ్వర్య తనతో ఎప్పుడూ చర్చించలేదని, తాము అంత సన్నిహితులం కాదని స్పష్టం చేశారు. ఐశ్వర్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని సూచించారు.

సల్మాన్ తో తన స్నేహం ఎలా ముగిసిందో చెప్పిన‌ శైలేంద్ర
ఇదే ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌తో తన స్నేహం ఎలా ముగిసిందో కూడా శైలేంద్ర వెల్లడించారు. "మా స్నేహం చాలా బలంగా ఉండేది. ‘కెప్టెన్’ అనే కమర్షియల్ సినిమా చేద్దామని ఆయన దగ్గరికి వెళ్లాను. కానీ, ఆ మీటింగ్‌కు సల్మాన్ మరికొంత మందిని పిలిచారు. అది నన్ను తీవ్రంగా అవమానించినట్టు అనిపించింది. అదే సల్మాన్‌తో నా చివరి మీటింగ్" అని తెలిపారు.

ఐశ్వర్యను తాను 18 ఏళ్ల వయసులోనే గుర్తించానని శైలేంద్ర గుర్తుచేసుకున్నారు. "మెరైన్ డ్రైవ్‌లో ఐశ్వర్యను తొలిసారి చూశాను. తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి 8:30 గంటలకు నన్ను, కునాల్ కపూర్‌ను కలవడానికి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 18 లేదా 19 ఏళ్లు. కేవలం రూ.5,000కే మాతో మూడు యాడ్స్ చేసింది. ఆమె చాలా హుందాగా ఉండే వ్యక్తి. మన ఇండస్ట్రీకి ఐశ్వర్య లాంటి వారే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలి" అని ఆయన ప్రశంసించారు.
Shailendra Singh
Salman Khan
Aishwarya Rai Bachchan
Bollywood
Violent Love Story
Affair
Sachin Tendulkar
Relationship
Captain Movie
Bollywood Gossip

More Telugu News