Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేశ్

Nara Lokesh Urges TDP to Counter YSRCP Propaganda
  • వైసీపీ చేయకూడని పాపాలు చేసిందన్న లోకేశ్
  • కూటమిని చీల్చే కుట్ర చేస్తోందని మండిపాటు
  • కూటమిని చీల్చడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్య
వైసీపీ చేయకూడని పాపాలన్నీ చేసిందని మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని అన్నారు. కూటమిని చీల్చే కుట్ర కూడా చేస్తున్నారని... కూటమి పార్టీలను విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. టీడీపీ టౌన్, వార్డు, మండల స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని లోకేశ్ సూచించారు. కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత చాలా ముఖ్యమని అన్నారు. తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి, భక్తుల మనోభావాలను గాయపరిచారని విమర్శించారు. 
Nara Lokesh
YSRCP
TDP
Andhra Pradesh Politics
AP Coalition
TDP Cadre Training
Tirumala
Fake Propaganda
Political Criticism

More Telugu News