మళ్లీ యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్

  • నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన కోహ్లీ ఇన్స్టా అకౌంట్
  • ఏమైందంటూ అనుష్కను ట్యాగ్ చేస్తూ పలువురి ఆరా 
  • అకౌంట్ యాక్టివేట్ కావడంతో ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ ఇన్స్టా పేజ్ లో యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. దీంతో, కోహ్లీ తన ఇన్స్టా అకౌంట్ ను క్లోజ్ చేశాడా? అనే సందేహాలు కూడా జనాల్లో మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు ఆయన అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయింది. దీంతో, ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

మరోవైపు, కోహ్లీ ఇన్స్టా అకౌంట్ క్లోజ్ అయినప్పుడు... అకౌంట్ కు ఏమైందా? అని అనుష్కను ట్యాగ్ ను చేస్తూ పలువురు ప్రశ్నించారు. ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అలాంటి సమస్య తలెత్తితే ఇతరుల ఖాతాలు కూడా కనిపించకుండా పోవాలి కదా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News