రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి.. తొలి సీఎంగా చరిత్ర
- హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో లీడర్ షిప్ కోర్సును పూర్తి చేసుకున్న రేవంత్
- సర్టిఫికెట్ అందించిన హార్వర్డ్ అధ్యాపకులు
- శిక్షణలో సాధారణ విద్యార్థిలా గడిపిన రేవంత్
ఈ ప్రోగ్రామ్ లో ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమయింది. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా క్లాసులు జరిగాయి. ఈ శిక్షణలో రేవంత్ సాధారణ విద్యార్థిలా గడిపారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లు, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా వీరికి శిక్షణ కొనసాగింది. మంచు తుపాను కారణంగా అక్కడి ఉష్ణోగ్రతలు -24 డిగ్రీలకు పడిపోయినప్పటికీ... విరామం తీసుకోకుండా రేవంత్ క్లాసులకు హాజరయ్యారు.