Samantha: మళ్లీ తన పేరు మార్చుకుంటున్న సమంత

Samantha Ruth Prabhu Changes Name After Raj Nidimoru Marriage
  • నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత అక్కినేనిగా పేరు మార్పు
  • విడాకుల తర్వాత మళ్లీ పాత పేరుకు మారిన సమంత
  • ఇప్పుడు నిడిమోరును పేరు వెనుక చేర్చుకుంటున్న సామ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ లో వైవాహిక బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత కూడా సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. 

మరోవైపు, తన పేరును సమంత మళ్లీ మార్చుకుంటున్నారు. సమంత అసలు పేరు సమంత రూత్ ప్రభు. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో, తన పేరును మళ్లీ సమంత రూత్ ప్రభుగా మార్చుకున్నారు. ఇప్పుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత... తన పేరు చివర తన భర్త ఇంటిపేరును చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 

సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' చిత్రంలో నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి... రాజ్ నిడిమోరు క్రియేటర్ గా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్స్ లో సమంత పేరును సమంత నిడిమోరుగా ప్రదర్శించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా తన కొత్త పేరును ప్రపంచానికి తెలియజేయాలని సమంత భావిస్తున్నారట.
Samantha
Samantha Ruth Prabhu
Samantha Akkineni
Raj Nidimoru
Ma Inti Bangaram
Nandini Reddy
Telugu Cinema
Tollywood
Divorce
Marriage

More Telugu News