Gold Price: పసిడి ధరల జోరుకు బ్రేక్.. భారీగా పతనమైన బంగారం, వెండి

Gold Price Break Huge Fall in Gold Silver Prices
  • కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనం
  • లాభాల స్వీకరణతో కిందకి దిగొచ్చిన బులియన్ మార్కెట్
  • హైదరాబాద్‌లో రూ.8,230 మేర తగ్గిన 24 క్యారెట్ల బంగారం
  • కిలో వెండిపై రూ.10,000 వరకు తగ్గుదల నమోదు
గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల జోరుకు ఇవాళ‌ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారంపై సుమారు రూ.8,000 వరకు తగ్గగా, కిలో వెండిపై రూ.15,000 మేర తగ్గుదల కనిపించింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల ప‌సిడి ధర రూ.7,550 తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.4,15,000గా ఉంది.

ఇటీవల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు సైతం బంగారం కొనుగోలుకు ఎగబడిన విషయం తెలిసిందే. అయితే, నేటి ఆకస్మిక పతనం కొనుగోలుదారులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పసిడి ధర సుమారు 70 శాతం పెరిగింది. ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Price
Gold rate today
Silver Price
Hyderabad bullion market
Gold investment
Silver investment
Commodity market
Price drop
Market experts
Price decrease

More Telugu News