ఫోన్ ట్యాపింగ్... కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్... కానీ!
- రేపు విచారణకు హాజరు కాలేనన్న కేసీఆర్
- కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం
- ఫామ్ హౌస్‌లో విచారించాలన్న విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకోనున్న సిట్
- రేపు తదుపరి విచారణ తేదీతో మరోసారి నోటీసులు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది.
న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది. రేపు తదుపరి విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు రేపు చివరి తేదీ అని, అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదనే నిబంధన ఉందని, తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనే విచారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.