Shanti Swaroop: జగన్‌కు కౌంటర్ ఇచ్చిన లేడీ గెటప్ శాంతిస్వరూప్... వీడియో ఇదిగో!

Shanti Swaroop Counters Jagans Allegations in Video
  • మంత్రి సుభాష్ డ్యాన్స్‌పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఆయనతో డ్యాన్స్ చేసింది తానేనన్న లేడీ గెటప్ శాంతి స్వరూప్
  • జగన్ వ్యాఖ్యలపై వీడియో విడుదల చేసిన శాంతి స్వరూప్
రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మహిళతో అశ్లీల నృత్యాలు చేశారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై జబర్దస్త్ కళాకారుడు, 'లేడీ గెటప్' శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. మంత్రి సుభాష్‌తో డ్యాన్స్ చేసింది తానే అని, తానేమీ మహిళను కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేస్తూ, "లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా నువ్వెలా సీఎం అయ్యావు అంటూ మిమ్మల్ని సోషల్ మీడియా కామెంట్స్‌లో అడుగుతున్నారు. జగన్ గారూ, మీరంటే నాకు అభిమానం. మీ నేతలకు నేను తెలుసు కదా! మాట్లాడేటప్పుడు మీకు తెలియకపోతే కనీసం మీ వాళ్లనైనా అడిగి తెలుసుకోండి. అక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో డ్యాన్స్ చేసింది నేనే... అమ్మాయి కాదు" అని పేర్కొన్నారు

జనవరి 15న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైపర్ ఆది టీమ్‌ను మంత్రి సుభాష్ పిలిచారని, అందులో భాగంగానే తాము ప్రదర్శన ఇచ్చామని వివరించారు. కళాకారుల కోరిక మేరకే మంత్రి వేదికపైకి వచ్చి రెండు స్టెప్పులు వేశారని, ఆయన తన వద్దకు వచ్చి డ్యాన్స్ చేయలేదని, తానే ఆయన వద్దకు వెళ్లి డ్యాన్స్ చేశానని తెలిపారు. అది రికార్డింగ్ డ్యాన్స్ కాదని, వేలమంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం అని శాంతి స్వరూప్ అన్నారు. "ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి మంత్రి రెండు స్టెప్పులు వేస్తే, మీరు ఆయన్నీ, మమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాట్లాడిన వీడియో చూసి చాలా బాధ కలిగింది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే బాగుండేది" అని హితవు పలికారు.

ఈ వివాదానికి ముందు, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి పాలనలో "ఆటవిక రాజ్యం" నడుస్తోందని, "అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా?" అనిపిస్తోందని విమర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, "అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు, స్టేజీపై డ్యాన్సర్లతో చిందులు వేశాడు" అని వ్యాఖ్యానించారు. 

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ తీవ్రంగా మండిపడ్డారు. మగవారి అందాల గురించి మాట్లాడే జగన్, తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను డ్యాన్స్ చేసింది లేడీ గెటప్ వేసే కళాకారుడు శాంతి స్వరూప్‌తో అని, ఈ విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. "కనీసం రోజాను అడిగినా చెప్పేవారు కదా?" అని ఎద్దేవా చేశారు. కళాకారులకు, రికార్డింగ్ డ్యాన్సర్లకు తేడా తెలియకుండా జగన్ కళారంగాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో సెట్టింగ్‌లు వేసుకునే జగన్‌కు తమ సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
Shanti Swaroop
Vasamshetti Subhash
YS Jagan
Jabaradasth
Telugu News
Andhra Pradesh Politics
Sankranti Celebrations
Hyper Aadi
YSRCP
Lady Getup

More Telugu News