KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు.. రేపు విచారణకు రాలేనంటూ సిట్‌కు కేసీఆర్ రిప్లయ్
- నోటీసుల నేపథ్యంలో సిట్‌కు ప్రత్యుత్తరం రాసిన కేసీఆర్
- రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు అన్న కేసీఆర్
- ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని తనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు సిట్‌కు ఆయన సమాధానం ఇచ్చారు. తాను రేపు విచారణకు రాలేనని, శుక్రవారమే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ అని అందులో ప్రస్తావించారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని తెలిపారు. విచారణకు మరో రోజు కేటాయించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.
అలాగే తనను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. 160 సీఆర్పీసీ కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలనే నిబంధనలు ఏమీలేవని గుర్తు చేశారు. భవిష్యత్తులో నోటీసులను ఎర్రవల్లికే పంపించాలని ఆ లేఖలో కోరారు.