Pinky Mali: కనీస మానవత్వం చూపలేదు: ఫ్లైట్ అటెండెంట్ పింకీ తండ్రి ఆవేదన

Pinky Mali Family Anguish Over Flight Attendant Death
  • టీవీ వార్తలు చూసి కూతురి మరణం గురించి తెలుసుకున్నామని వెల్లడి
  • మృతదేహాన్ని తామే ఎన్నో కష్టాలకోర్చి తెచ్చుకున్నామని ఆవేదన
  • ప్రమాదంపై విచారణ జరిపించాలని, పరిహారం ప్రకటించలేదని ఆగ్రహం
బారామతి విమాన ప్రమాదంలో మరణించిన ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి (29) కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, విమానయాన సంస్థ తమ పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, అమానవీయంగా వ్యవహరించాయని పింకీ తండ్రి శివకుమార్ మాలి ఆరోపించారు. తమ కూతురు ప్రమాదంలో చనిపోయిన విషయం కూడా టీవీ వార్తలు చూసి తెలుసుకోవాల్సి వచ్చిందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

గురువారం పింకీ అంత్యక్రియల అనంతరం శివకుమార్ మాలి మీడియాతో మాట్లాడుతూ, "నా కూతురు ఘోర ప్రమాదంలో చనిపోయింది. కానీ ఆమె పనిచేస్తున్న వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహాన్ని తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. అది వారి బాధ్యత కాదా?" అని ప్రశ్నించారు. ప్రభుత్వం గానీ, కంపెనీ గానీ కనీస మానవత్వం చూపలేదని మండిపడ్డారు. తామే స్వయంగా బారామతి వెళ్లి, ఎన్నో ఇబ్బందులు పడి మృతదేహాన్ని ముంబైకి తీసుకువచ్చామని తెలిపారు.

బుధవారం బారామతి ఎయిర్‌పోర్ట్‌లో విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ, కంపెనీ గానీ తమను సంప్రదించలేదని, ఎలాంటి పరిహారం ప్రకటించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సెంట్రల్ ముంబైలోని ప్రభాదేవిలో పింకీ మాలి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య జరిగాయి.
Pinky Mali
Baramati plane crash
flight attendant
VSR Ventures
Ajit Pawar
Maharashtra
plane accident
India plane crash
aviation accident
Mumbai

More Telugu News