Kim Kardashian: పదిహేనేళ్లుగా సూపర్ మార్కెట్‌ ముఖం చూడలేదన్న ఇంటర్నేషల్ రియాలిటీ స్టార్

Kim Kardashian hasnt been to a supermarket in 15 years
  • దశాబ్దకాలం పైగా తాను సూపర్ మార్కెట్‌కు వెళ్లలేదని చెప్పిన కిమ్ కర్దాషియాన్
  • తన కోసం స్టోర్ మొత్తం మూసివేస్తేనే షాపింగ్‌కు వస్తానని వెల్లడి
  • అయితే కూతురు నార్త్‌తో కలిసి తరచూ మాల్‌కు వెళతానని స్పష్టం
  • కూతురి ఇష్టాలను ప్రోత్సహిస్తూ కోర్సులు నేర్పిస్తున్నట్టు తెలిపిన కిమ్
ప్రముఖ రియాలిటీ స్టార్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియాన్ తన జీవనశైలికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. దాదాపు పదిహేనేళ్లుగా, షాపింగ్ కోసం తాను సూపర్ మార్కెట్‌ వైపే వెళ్లలేదని వెల్లడించారు. ఒకవేళ తాను షాపింగ్ చేయాలంటే, తన కోసం ఆ స్టోర్‌ కు ఇతరులను ఎవరినీ రానివ్వకుండా మూసివేసి, తనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని షరతు పెట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

‘ఫీమేల్ ఫస్ట్ యూకే’ కథనం ప్రకారం, తన సోదరి క్లో కర్దాషియాన్ నిర్వహిస్తున్న ‘క్లో ఇన్ వండర్‌ల్యాండ్’ అనే పోడ్‌కాస్ట్‌లో కిమ్ ఈ విషయాలు పంచుకున్నారు. "నేను సూపర్ మార్కెట్‌కు వెళ్లి చాలా కాలమైంది. మా షో కోసం కొన్నేళ్ల కిందట ఎరెవాన్ అనే స్టోర్‌కు వెళ్లినట్టు గుర్తు. కానీ అంతకుముందు చాలా ఏళ్లుగా వెళ్లలేదు. మొత్తం మీద ఓ 15 ఏళ్లు అయి ఉంటుంది" అని కిమ్ తెలిపారు. 

అమెరికాలోని పురాతన సూపర్ మార్కెట్ చైన్ అయిన ‘రాల్ఫ్స్’ యాజమాన్యాన్ని తాను స్టోర్‌లో ఒంటరిగా షాపింగ్ చేసేందుకు అనుమతించాలని చాలాసార్లు అభ్యర్థించినట్లు ఆమె చెప్పారు.

అయితే, సూపర్ మార్కెట్‌లకు వెళ్లకపోయినా, తన పెద్ద కూతురు నార్త్ వెస్ట్‌తో కలిసి తరచూ షాపింగ్ మాల్స్‌కు వెళతానని కిమ్ స్పష్టం చేశారు. "నేను నార్త్‌తో కలిసి మాల్స్‌కు ఎప్పుడూ వెళుతుంటాను" అని ఆమె అన్నారు. తాను, తన సోదరి క్లో ఇంట్లో పనులన్నీ చేసుకుంటామని కూడా తెలిపారు.

పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ

ఈ పోడ్‌కాస్ట్‌లో కిమ్ తన పిల్లల పెంపకం గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా తన పెద్ద కూతురు 12 ఏళ్ల నార్త్ ఆసక్తులను ప్రోత్సహించేందుకు 'రియలిస్టిక్ కోర్సులు' ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. "నార్త్‌కు టోపీలు, ఆభరణాలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దాన్నే మేం ఒక కోర్సుగా మార్చాం. ఆమె ఆ రంగంలో రాణించడం చూడటం చాలా ఆనందంగా ఉంది" అని వివరించారు. 

తన మాజీ భర్త కాన్యే వెస్ట్‌తో నార్త్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. "నార్త్ ప్రస్తుతం సంగీతంలో కూడా శిక్షణ తీసుకుంటోంది. ఇది ఆమెకు తన తండ్రితో బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. సంగీతం, ప్రొడ్యూసింగ్ నా పరిధిలోని అంశాలు కావు. పిల్లల విషయంలో కాన్యే అభిప్రాయాలకు నేను ఎప్పుడూ గౌరవం ఇస్తాను" అని కిమ్ స్పష్టం చేశారు. నార్త్‌ను తన 'బెస్టీ'గా భావిస్తున్నారనే ప్రచారాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. కిమ్‌కు కాన్యే వెస్ట్‌తో నార్త్, సెయింట్ (10), చికాగో (8), సామ్ (6) అనే నలుగురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
Kim Kardashian
Reality TV
Shopping
Supermarket
Khloe Kardashian
North West
Kanye West
Parenting
Celebrity Lifestyle

More Telugu News