మేడారంలో ఆకాశాన్నంటుతున్న కోళ్లు, మేకలు, గొర్రెల ధరలు
- భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
- అమ్మవార్లకు భారీగా బలులు ఇస్తున్న భక్తులు
- దీన్ని ఆసరాగా చేసుకుని ధరలను పెంచేసిన వ్యాపారులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వీటి ధరలను అమాంతం పెంచేశారు.
సాధారణంగా కిలో రూ. 200 నుంచి రూ. 250 ఉండే కోడి ధర, జాతరలో రూ. 350 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. ఇక మేకలు, గొర్రెల పరిస్థితిలో కూడా తేడా లేదు. సాధారణ రోజుల్లో రూ. 7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలికే మేక పోతులను ప్రస్తుతం రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, మొక్కుబడి తీర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు భరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. జాతర ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది.