Dhurandhar: దేశీయంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సరికొత్త చరిత్ర!
- బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2 చిత్రాల సరసన చేరిన సినిమా
- ఒకే భాషలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్
- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తాజాగా భారత మార్కెట్‌లో రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. ట్రేడింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది.
ఇప్పటివరకు ఈ రికార్డు 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (రూ.1417 కోట్లు), 'కేజీఎఫ్: ఛాప్టర్ 2' (రూ.1001 కోట్లు), 'పుష్ప 2: ది రూల్' (రూ.1471.1 కోట్లు) పేరిట మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ చిత్రాల సరసన 'ధురంధర్' కూడా చేరింది. అయితే, ఈ సినిమా సాధించిన విజయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలన్నీ బహుళ భాషల్లో విడుదల కాగా, 'ధురంధర్' మాత్రం కేవలం ఒకే భాష(హిందీ)లో విడుదలై ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.
శాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం, 56వ రోజు నాటికి ఈ సినిమా నెట్ కలెక్షన్లు రూ.835.6 కోట్లుగా ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పాకిస్థాన్‌కు చెందిన నలుగురు డేంజరస్ టెర్రరిస్టులను ఎదుర్కొనే పాత్రలో నటించారు. ఆయన పాత్ర మేజర్ మోహిత్ శర్మను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారని ప్రచారం జరిగినా, అది పూర్తిగా కల్పితమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో పాకిస్థాన్‌లోని వివిధ జాతుల మధ్య ఉన్న సామాజిక-రాజకీయ అంశాలను కూడా లోతుగా చర్చించారు.