Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్.. ఫొటోలు ఇవిగో
- బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు
- నివాళి అర్పించిన నారా లోకేశ్
- అంత్యక్రియలకు హాజరైన అనగాని, కృష్ణదేవరాయలు, మాగుంట
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికకాయాన్ని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. దివంగత అజిత్ పవార్ కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.
మరోవైపు అజిత్ పవార్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియలకు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా హాజరయ్యారు.