పాడి.. ఆడి.. అదరగొట్టిన చిరు.. 'పెద్ది రెడ్డి' వీడియో సాంగ్ వచ్చేసింది!

  • 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నుంచి పెద్ది రెడ్డి సాంగ్ రిలీజ్
  • ఈ పాటను స్వయంగా ఆలపించిన మెగాస్టార్ చిరంజీవి
  • భీమ్స్ సంగీతానికి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో అదిరిన స్టెప్పులు
  • 400 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న మెగాస్టార్ చిత్రం
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి చిత్ర బృందం ఓ కొత్త అప్‌డేట్ ఇచ్చింది. సినిమాలో ప్రేక్షకులతో ఈలలు వేయించిన "పెద్ది రెడ్డి" ఫుల్ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్‌కు చేరువలో ఉండటం విశేషం.

ఈ మాస్ పాటకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి పర్యవేక్షణలో చిత్రీకరించిన ఈ పాటలో చిరంజీవి తనదైన శైలిలో మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. అంతేకాకుండా ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన ఎనర్జిటిక్ సంగీతం, రఘురాం రాసిన సాహిత్యం పాట‌కు మరింత ఊపునిచ్చాయి. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



More Telugu News