KCR: బిగ్ బ్రేకింగ్... ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు

SIT to serve notices to KCR in phone tapping case
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
  • కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఫాంహౌస్ కు బయల్దేరిన అధికారులు
  • రేపు కేసీఆర్ ను విచారించనున్నట్టు సమాచారం
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ కు నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు లు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
KCR
BRS
Phone Tapping Case
SIT

More Telugu News