ఏపీ లిక్కర్ కేసు... చెవిరెడ్డికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు
- చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- 226 రోజుల జైలు జీవితాన్ని గడిపిన చెవిరెడ్డి
- సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి భారీ ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, విచారణకు సహకరించాలని వీరికి హైకోర్టు షరతులు విధించింది.
వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఈ కేసు నమోదయింది. గత జూన్ 17వ తేదీన చెవిరెడ్డిని బెంగళూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 226 రోజుల పాటు చెవిరెడ్డి జైలు జీవితాన్ని గడిపారు. ఈరోజు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. మరోవైపు, ఇదే కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డిలకు నిరాశ ఎదురైంది. వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.