Bangladesh: షూటింగ్ టీమ్‌కు బంగ్లాదేశ్ ‘గ్రీన్ సిగ్నల్’.. టీ20 వరల్డ్ కప్‌కు ‘నో’

Bangladesh Greenlights Shooting Team but Bans T20 World Cup
  • భద్రతా కారణాలతో టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన బంగ్లా 
  • షూటింగ్ జట్టులో సభ్యులు తక్కువగా ఉండటం, ఇండోర్ ఈవెంట్ కావడంతో భద్రతపై ధీమా
  • న్యూఢిల్లీలో జరిగే షూటింగ్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న బంగ్లాదేశ్ షూటర్లు
  • ఒకే దేశానికి ఒక క్రీడ విషయంలో నిరాకరించి, మరో క్రీడకు ఒప్పుకోవడంపై చర్చ
భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం షూటింగ్ క్రీడలో మాత్రం మెత్తబడింది. భద్రతా కారణాలను సాకుగా చూపి క్రికెట్ జట్టును భారత్‌కు పంపేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ తాజాగా తన దేశ షూటింగ్ జట్టు న్యూఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించింది.

క్రికెట్ జట్టు విషయంలో చూపిన భద్రతా ఆందోళనలు షూటింగ్ జట్టుకు వర్తించవని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలను ఆ దేశం ఉదహరించింది. క్రికెట్ జట్టుతో పోలిస్తే షూటింగ్ బృందంలో సభ్యుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వీరికి భద్రత కల్పించడం సులభమని బంగ్లా భావిస్తోంది. అలాగే షూటింగ్ పోటీలు నియంత్రిత వాతావరణంలో, ఇండోర్ వేదికల్లో జరుగుతాయి. బహిరంగ మైదానాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌ల కంటే వీటికి రిస్క్ తక్కువని బంగ్లాదేశ్ అధికారులు విశ్లేషించారు.

ఒకే సమయంలో భారత్‌లో భద్రత లేదని వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం, మరోవైపు ఢిల్లీకి షూటర్లను పంపడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ గైర్హాజరు కావడం ఆ టోర్నీపై ప్రభావం చూపుతుండగా, షూటర్ల పర్యటన మాత్రం ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా తెగిపోలేదన్న సంకేతాన్నిస్తోంది.  
Bangladesh
Bangladesh T20 World Cup
T20 World Cup
Shooting team
India
Sports
Cricket
Security concerns
Bangladesh government
Delhi

More Telugu News