Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రాక, ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం
- ప్రచారం కోసం అమిత్ షా, నితిన్ నబీన్ సిన్హా రానున్నారని తెలిపిన రామచందర్ రావు
- 10 రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెల్లడి
- అమెరికా నుంచి తిరిగి వచ్చాక కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రానున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం జాతీయ నేతలు కూడా వస్తున్నారని ఆయన వెల్లడించారు. పది రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహిస్తామని అన్నారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన, ఈ నెలాఖరున స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు.
ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.