Sharad Pawar: ఇది ప్రమాదమే.. కుట్ర కాదు: అజిత్ మృతిపై శరద్ పవార్ భావోద్వేగం

Ajit Pawar death was an accident not a conspiracy Sharad Pawar
  • విమాన ప్రమాదంలో మహారాష్ట్ర నేత అజిత్ పవార్ దుర్మరణం
  • ఇది కేవలం ప్రమాదమేనని, కుట్ర కాదని శరద్ పవార్ స్పష్టీకరణ
  • సమర్థుడైన నాయకుడిని కోల్పోయామంటూ భావోద్వేగం
  • ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై సీనియర్ నాయకుడు శరద్ పవార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. 

"అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీరని నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయాం. ఈ లోటు ఎప్పటికీ పూడ్చలేనిది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"అన్నీ మన చేతుల్లో ఉండవు. కొన్ని సంఘటనల వెనుక ఎలాంటి రాజకీయం ఉండదు. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. ఈ బాధను మహారాష్ట్ర, మనమందరం ఎప్పటికీ భరించాల్సిందే" అని శరద్ పవార్ అన్నారు. కాగా, అజిత్ పవార్ ప్రయాణిస్తున్నది వీఎస్ఆర్ ఏవియేషన్‌కు చెందిన బాంబార్డియర్ లియర్ జెట్- 45 విమానంగా అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.
Sharad Pawar
Ajit Pawar
Maharashtra
VSR Aviation
Bombardier Learjet 45
Plane crash
NCP leader
Political conspiracy
Accident
Death

More Telugu News