భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం.. అమెరికా వాణిజ్య ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

  • ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను పరిశీలించానన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి
  • దీని వల్ల భారత్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న జెమిసన్ గ్రీర్
  • ఈ ఒప్పందం ద్వారా భారత్‌దే పైచేయి అవుతుందని వ్యాఖ్య
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. ఈ మేరకు అగ్రరాజ్యం వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని వివరాలను పరిశీలించానని, దీని వల్ల భారత్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఐరోపా మార్కెట్‌లో భారత్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ ఒప్పందం ద్వారా భారత్‌ది పైచేయి అవుతుందని అన్నారు.

భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. మా దేశంలోకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధిస్తుండటంతో పలు దేశాలు తమ ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్ల వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈయూ, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.


More Telugu News