అజిత్ పవార్ మరణం.. ఆ విమానాలను నిలిపేస్తారా అంటే యజమాని ఏమన్నారంటే?
- లియర్ జెట్-45 విమానాలను నిలిపివేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్న
- తమ విమానాల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్న యజమాని వీకే సింగ్
- విమానాలు ఫిట్‌గా ఉన్నప్పుడు నిలిపివేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్న
వీఎస్ఆర్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 మోడల్ విమానంలో ప్రయాణిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. లియర్ జెట్ మోడల్ విమానం 2023లో కూడా ఇదేవిధంగా ముంబైలో క్రాష్ ల్యాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కు చెందిన ఇతర విమానాలను నిలిపివేస్తారా అని మీడియా ప్రతినిధులు వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తమ విమానాల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఆయన అన్నారు. అవి ప్రయాణాలకు అనువుగానే ఉన్నాయని వెల్లడించారు. విమానాలు ఫిట్‌గా ఉన్నప్పుడు వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ఎదురు ప్రశ్నించారు.
బారామతి విమాన ప్రమాదంలో మృతి చెందిన పైలట్లు కూడా అనుభవం కలిగిన వారేనని తెలిపారు. ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్‌కు 16,000 గంటలు నడిపిన అనుభవం, కోపైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్‌కు 1,500 గంటలు నడిపిన అనుభవం ఉందని అన్నారు.