ఐసీసీ ర్యాంకింగ్స్... టాప్ 10లోకి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 1 స్థానంలోనే అభిషేక్
- న్యూజిలాండ్ సిరీస్‌లో అదరగొడుతున్న సూర్యకుమార్, అభిషేక్ శర్మ
- 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న అభిషేక్
- ర్యాంకింగ్స్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్య, శివమ్ దుబేలకు చోటు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ టాప్ టెన్ బ్యాట్స్‌మెన్ జాబితాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న సూర్యకుమార్ ఐదు స్థానాలు ఎగబాకి 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. పొట్టి క్రికెట్‌లో పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్, ఫామ్‌లోకి వచ్చాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టీ20లో 82, మూడో టీ20లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా మూడో టీ20లో 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. నాగపూర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 929 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ఇంగ్లాండ్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ (849), తిలక్ వర్మ (781) వరుసగా రెండు, మూడు స్థానాలలో ఉన్నారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు. మూడో టీ20లో మూడు వికెట్లు తీసి రాణించాడు. ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్య ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు, శివమ్ దుబే ఐదు స్థానాలు ఎగబాకి పదకొండవ ర్యాంకుకు చేరుకున్నారు. అక్షర్ పటేల్ 3 స్థానాలు పడిపోయి 13వ ర్యాంకులో ఉన్నాడు.