Gold prices: ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices Soar Over Rs 8000 in a Day
  • హైదరాబాద్‌లో రూ.1,70,447కు చేరుకున్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
  • నిన్న రూ.1,62,380 పలిగిన బంగారం ధర
  • రూ.3.75 లక్షలు పలికిన కిలో వెండి
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3.75 లక్షలుగా ఉంది.

ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.26,821 పెరిగి రూ.3.83 లక్షలకు పలికి రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.1.62 లక్షలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ఔన్సు 5,296.79 డాలర్లకు, వెండి ఔన్సు 114 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, డాలర్ విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
Gold prices
Hyderabad bullion market
24 carat gold
22 carat gold
Silver price
MCX
International market

More Telugu News