Shambhavi Pathak: అజిత్ పవార్ విమానంలో ఫస్ట్ ఆఫీసర్.. ఎవరీ శాంభవీ పాఠక్?

Shambhavi Pathak First Officer on Ajit Pawar Flight
  • బారామతి విమాన ప్రమాదంలో మృతి చెందిన శాంభవీ పాఠక్
  • చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందిన శాంభవి
  • న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న శాంభవి
  • అజిత్ పవార్ విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన శాంభవి
మహారాష్ట్రలోని బారామతిలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్‌లలో కెప్టెన్ శాంభవీ పాఠక్ ఒకరు. ఈ ప్రమాదంలో కీలక రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (కొన్ని సందర్భాల్లో కో-పైలట్ అంటారు)గా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందారు.

ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి పాఠక్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2016-18లో సెకండరీ స్కూల్ పూర్తయ్యాక ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. వాణిజ్య విమానాల శిక్షణ కోసం ఆమె న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో చేరారు.

అనంతరం భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రొజెన్ ఎయిర్ లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అంటే, భవిష్యత్తులో పెద్ద విమానాల కెప్టెన్ కావడానికి అవసరమైన సర్టిఫికెట్ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్‌లో కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ప్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేశారు. ఆమె క్రమశిక్షణ, నైపుణ్యం, పని పట్ల మక్కువ కలిగి ఉంటారని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు.

2022 నుంచి ఆమె వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పూర్తిస్థాయి ఫస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్ జెట్-45 లాంటి విమానాలను ఆమె నడుపుతున్నారు. ఈరోజు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పని చేశారు.
Shambhavi Pathak
Ajit Pawar
pilot accident
Baramati airport
Sumit Kapoor
VSR Ventures
aviation accident

More Telugu News