Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం

Ajit Pawar Death AP Cabinet Condolences
  • భేటీ ప్రారంభంలో పవార్ మరణాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
  • సంతాపం తెలిపిన మంత్రిమండలి
  • కేబినెట్ లో సంతాప తీర్మానం
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో సంతాప తీర్మానం చేసింది. భేటీ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తను ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.

ప్రమాద విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చంద్రబాబు చెప్పారు. అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. అజిత్‌ పవార్‌ మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని చంద్రబాబు అన్నారు. అజిత్ పవార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రులు మౌనం పాటించారు.

Ajit Pawar
Andhra Pradesh Cabinet
Chandrababu Naidu
Maharashtra Deputy Chief Minister
Plane accident
Condolence resolution
AP Cabinet meeting
Political loss Maharashtra

More Telugu News