Ajit Pawar: 2023లోనూ అజిత్ పవార్ విమానానికి ప్రమాదం.. వీడియో ఇదిగో!

Close Call for Ajit Pawar in 2023 Private Jet Incident
  • విశాఖపట్నం నుంచి ప్రైవేట్ ప్లేన్ లో ముంబై బయలుదేరిన అజిత్
  • భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం
  • అప్పుడు కూడా ఇదే కంపెనీ, ఇదే మోడల్ విమానం
బారామతి జిల్లా సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (అజిత్) అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. వీఎస్ఆర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన లియర్ జెట్ విమానంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన అజిత్ పవార్.. విమానం కుప్పకూలడంతో మరణించారు. కాగా, 2023లోనూ అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ప్రమాదానికి గురికాగా.. అజిత్ త్రుటిలో తప్పించుకున్నారు.

అప్పుడు కూడా ఇదే కంపెనీ, ఇదే విమానంలో ఆయన ప్రయాణించారు. 2023 సెప్టెంబర్ 14న విశాఖపట్నం నుంచి అజిత్ పవార్ ముంబైకి ప్రైవేట్ జెట్ లో బయలుదేరారు. ఆ సమయంలో ముంబైలో భారీ వర్షం కురుస్తుండడంతో విజిబిలిటీ తగ్గిందని, ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల అనుమతితో రన్ వే పై విమానం దిగింది. రన్ వే పై వరద నీరు నిలవడంతో విమానం స్కిడ్ అయి రెండు ముక్కలైంది. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు..
అజిత్ పవార్
కెప్టెన్ సుమిత్ కపూర్ (పైలట్)
కెప్టెన్ సంభి పాఠక్ (పైలట్)
విదిప్ జాదవ్ (ముంబై పీఎస్ఓ)
పింకీ మాలి (ఫ్లైట్ అటెండెంట్)
Ajit Pawar
Ajit Pawar accident
Maharashtra Deputy CM
VSR Aviation
Plane crash
Baramati
Mumbai airport
Private jet accident
Captain Sumit Kapoor
Election campaign

More Telugu News