Ajit Pawar: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి.. సీఎం ఫడ్నవీస్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్

Ajit Pawar plane crash PM Modi and HM Shah speak to Maha CM Devendra Fadnavis
  • ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరణ
  • ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి కూలిపోయిన విమానం
  • సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
  • స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటన
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇదుగురూ మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది.

బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన విమానం, సుమారు 9 గంటల సమయంలో బారామతి వద్ద ల్యాండింగ్ అవుతుండగా అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలముకున్నాయి. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల నేపథ్యంలో బారామతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మూడు మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించామని, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పుణె ఎస్పీ తెలిపారు. డీజీసీఏ అధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
Ajit Pawar
Ajit Pawar death
Maharashtra
Baramati plane crash
Devendra Fadnavis
Narendra Modi
Amit Shah
plane accident

More Telugu News