అమెరికన్లకే ఉద్యోగాలు.. టెక్సాస్‌లో కొత్త హెచ్-1బీ వీసాలు బంద్
- టెక్సాస్‌లో కొత్త హెచ్-1బీ వీసా పిటిషన్లపై తాత్కాలిక నిషేధం
- రాష్ట్ర ఏజెన్సీలు, యూనివర్సిటీలకు వర్తించనున్న గవర్నర్ ఆదేశాలు
- టెక్సాస్ ప్రజలకే ఉద్యోగాలు దక్కాలన్నది ప్రభుత్వ ఉద్దేశం
- ఈ నిలిపివేత 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టీకరణ
- నిపుణుల కొరత ఏర్పడుతుందని విపక్షాల ఆందోళన
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన వారికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు, యూనివర్సిటీలు కొత్తగా హెచ్-1బీ వీసా పిటిషన్లు దాఖలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిలిపివేత 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
"ప్రభుత్వ నిధులతో నడిచే ఉద్యోగ అవకాశాలు తొలుత టెక్సాస్ ప్రజలకే దక్కాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలి" అని అబాట్ తన లేఖలో పేర్కొన్నారు. తక్కువ జీతాలకు విదేశీ నిపుణులను నియమించుకుంటూ అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, గవర్నర్ నిర్ణయంపై డెమోక్రాట్లు, విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చర్య వల్ల రాష్ట్రంలోని యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, ఆసుపత్రులలో నిపుణుల కొరత తీవ్రమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రతిభను ఆకర్షించడం కష్టమవుతుందని డెమోక్రాట్ ప్రతినిధి రామన్ రొమెరో అన్నారు.
ఈ ఆదేశాల ప్రకారం టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి పొందితే కొన్ని మినహాయింపులకు అవకాశం కల్పించారు. ఈ వీసా విధానంపై చట్టపరమైన నిబంధనలు రూపొందించేందుకు చట్టసభ సభ్యులకు సమయం ఇవ్వడంతో పాటు ట్రంప్ యంత్రాంగం చేపడుతున్న సంస్కరణల అమలుకు ఈ విరామం దోహదపడుతుందని అబాట్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, టెక్సాస్ ఏ&ఎం వంటి అనేక ప్రముఖ విద్యాసంస్థలపై ప్రభావం పడనుంది.