Under 19 World Cup: అండర్-19 వరల్డ్ కప్... భారీ తేడాతో జింబాబ్వేను ఓడించిన భారత్
- 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే
- 148 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు
- 204 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం
- విహాన్ మల్హోత్రా శతకం (109).. అభిజ్ఞాన్ (61), సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలు
అండర్-19 ప్రపంచకప్ 2026లో యంగ్ ఇండియా జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు 148 పరుగులకే ఆలౌట్ చేశారు. జింబాబ్వే బ్యాటర్లలో లీరాయ్ 62 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి పోరాడగా, కియాన్ (37), టటేండ్ర (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఉద్దవ్, ఆయుష్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంబ్రిష్ రెండు వికెట్లు, హెనిల్, ఖిలాన్ చెరో వికెట్ తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. విహాన్ మల్హోత్రా (109) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, అభిజ్ఞాన్ (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆరోన్ జార్జ్ (23), ఆయుష్ మాత్రే (21), అంబ్రిష్ (21), వేదాంత్ త్రివేది (15) పరుగులు చేశారు. చివర్లో ఖిలాన్ పటేల్ (30) దూకుడుగా ఆడటంతో భారత్ 350 మార్క్‌ను దాటి 352 పరుగులు చేసింది.
జింబాబ్వే బౌలర్లలో చిముగోరో 3, పనాషే మజై 2, సింబరాషే 2, ధ్రువ్ పటేల్ ఒక వికెట్ తీశారు. అనంతరం 353 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గ్రూప్-2లో ఆరు విజయాలతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో, మూడో స్థానాల్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఉన్నాయి.