APPSC Group 2: ఏపీపీఎస్సీ గ్రూప్-2 తుది ఎంపిక జాబితా విడుదల

APPSC Group 2 Final Selection List Released
  • మొత్తం 905 పోస్టులకు గాను 891 మంది ఎంపిక
  • హారిజంటల్ రిజర్వేషన్‌తో 25 పోస్టుల్లో మార్పులకు అవకాశం
  • కోర్టు ఆదేశాలతో 2 క్రీడా కోటా పోస్టులు రిజర్వ్
  • న్యాయస్థానంలో కేసుల కారణంగా ఫలితాల్లో జాప్యం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. కొంతకాలంగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. మొత్తం 905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతానికి 891 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

అయితే, ఈ 891 పోస్టుల్లో 25 పోస్టుల ఫలితాలు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని, హారిజంటల్ రిజర్వేషన్ల కారణంగా వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉందని కమిషన్ స్పష్టం చేసింది. మిగిలిన 866 పోస్టుల ఎంపికలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు క్రీడా కోటాకు చెందిన రెండు పోస్టులను (న్యాయశాఖ ఏఎస్‌వో, ఎక్సైజ్‌ ఎస్‌ఐ) పక్కనపెట్టారు.

ప్రకటించని 14 పోస్టులలో ఈ రెండు పోస్టులతో పాటు, నిర్దేశిత కేటగిరీలలో అర్హులైన అభ్యర్థులు లేనందున 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులు ఉన్నట్లు కమిషన్ పేర్కొంది.

ఏపీపీఎస్సీ 2023 డిసెంబర్ 7న 905 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష, 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. క్రీడా కోటా రిజర్వేషన్‌పై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో తుది జాబితా విడుదలలో జాప్యం జరిగింది.
APPSC Group 2
APPSC
Group 2 results
Andhra Pradesh Public Service Commission
APPSC Group 2 selection list
APPSC exams
Government jobs Andhra Pradesh
APPSC recruitment
APPSC notification
APPSC Group 2 cut off

More Telugu News