Joginapally Santosh Rao: ఐదు గంటల పాటు జోగినపల్లి సంతోష్ రావు విచారణ

Joginapally Santosh Rao Questioned for Five Hours
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీని ప్రశ్నించిన సిట్
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నించిన సిట్
  • ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన సిట్
బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ ఐదు గంటల పాటు కొనసాగింది. సిట్ అధికారులు సంతోష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలను ముందుంచి సిట్ ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశంపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును విచారించిన విషయం విదితమే.
Joginapally Santosh Rao
Santosh Rao
BRS
Telangana Politics
Phone Tapping Case
Telangana SIT Investigation

More Telugu News