Perni Nani: సొంతూరిలో పేర్ని నానిపై కేసు నమోదు

Case Filed Against Perni Nani in Home Town
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై అనుచిత వ్యాఖ్యల ఫలితం
  • మచిలీపట్నంలో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఆయన సొంతూరిలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదు మేరకు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇటీవల జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై తీవ్రమైన, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం పెద్దదైంది.

టీడీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద పేర్ని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
Perni Nani
Chandrababu Naidu
Pawan Kalyan
YSRCP
TDP
Machilipatnam
Andhra Pradesh Politics
Defamation Case
Political Speech
Tirumala Laddu

More Telugu News