Kishan Reddy: వాడెవడో అర్జెంటినా నుంచి మెస్సీ వస్తే సింగరేణికి ఏం సంబంధం?: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy Angry Over Revanth Reddy Spending on Messi
  • మెస్సీ వచ్చినప్పుడు సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
  • కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శ
  • సింగరేణి కార్మికుల కష్టాన్ని మెస్సీ కార్యక్రమానికి ఖర్చు చేశారని మండిపాటు
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ఏడాది అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ వస్తే సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని విమర్శించారు.

"ఎవడో ఫుట్‌బాల్ ఆడుతాడట. వాడెవడో మెస్సీ ఇతర దేశాల నుంచి వస్తే నా సింగరేణికి ఏం సంబంధం? అతను వస్తే సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు. సింగరేణిలో కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి, పెంచడానికి డబ్బులు లేవు. మెడికల్ రీయింబర్సుమెంట్స్ కోసం డబ్బులు లేవు. కానీ ఎవడో మెస్సీ వస్తే వానికి డబ్బులు ఇస్తాడు. అతనిని ఆడించడం కోసం నా సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బును అక్కడ ఖర్చు పెట్టాడనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు?" అని ఆయన ప్రశ్నించారు.
Kishan Reddy
Revanth Reddy
Singareni Collieries
Lionel Messi
Telangana Congress
BRS
Corruption

More Telugu News