కాలిఫోర్నియాలో కదులుతున్న కారులో నుంచి రోడ్డుపై పడిన చిన్నారి... తల్లి అరెస్టు

  • జనవరి 20 పులెర్టన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
  • కారులో వెళుతుండగా కిందపడిన 19 నెలల బాలుడు
  • వెనుక మరో కారులో వస్తున్న వ్యక్తి అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
కాలిఫోర్నియాలో కదులుతున్న ఎస్‌యువీ నుంచి 19 నెలల బాలుడు కిందపడిన సంఘటనలో పోలీసులు ఆ బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జనవరి 20న చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని పులెర్టన్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

వీడియోలో కనిపిస్తున్న ప్రకారం... ఒక ఎస్‌యూవీ కారు వెళుతుండగా చిన్నారి రోడ్డుపై పడిపోయాడు. అది ఒక కూడలి కావడంతో కారు ఎడమవైపు తిరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

వెంటనే వెనుకనే వస్తున్న మరో వాహనదారుడు అప్రమత్తంగా స్పందించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను చిన్నారి తల్లి జాక్వెలిస్ హెర్నాండేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


More Telugu News